సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ఉద్యోగులు కృషి చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సంక్షేమ పథకాలు  ప్రజలకు చేరేలా ఉద్యోగులు కృషి చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.  గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో  జీవించాలని ఆకాక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటికి తక్షణమే  పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 

 రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

జనవరి 2026 మాసాన్ని రోడ్డు భద్రత మాసంగా గుర్తించారని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్, సీట్  బెల్ట్ ధరించాలని కోరారు. వివిధ సంఘాల డైరీలు, క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. 

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఆర్డీవోలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవ్, జిల్లా అధికారులు సిబ్బంది  హాజరైనారు.