
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మంజూరైన టాయిలెట్స్ ను వెంటనే పూర్తిచేసి వాటికి బిల్లులు త్వరగా చెల్లింపులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు త్వరగా డబ్బులు చెల్లించాలని హౌసింగ్ పీడిని ఆదేశించారు.
డీఆర్డీఏ పీడీ వీవీ అప్పారావు, డివిజనల్ పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీపీఓ యాదగిరి, ఎంపీడీవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. టీచింగ్ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా జీజీహెచ్ ఆవరణలో నిర్మాణం అవుతున్న టీచింగ్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన కి తీసుకురావాలని ఆదేశించారు.