
- సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. కనీస మద్దతు ధరలు, పత్తి నాణ్యత ప్రమాణాలు, కపాస్ కిసాన్ యాప్ అవగాహన పోస్టర్ ను మంగళవారం కలెక్టర్ ఆయన చాంబర్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు స్లాట్ బుక్ చేసుకునే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏఈఓలు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెటింగ్ కమిటీ సహాయ కార్యదర్శి ఎం వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.