
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వాచ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో బోర్ వెల్స్ వద్ద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. మున్సిపాలిటీల్లో నూతన ఇండ్ల నిర్మాణాలకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు స్టోరేజ్ ఫాండ్స్ రీచార్జ్ పిట్స్, రూప్ టాప్ రైన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ తప్పక నిర్మించాలన్నారు.
గ్రామ పంచాయతీల్లో అనువైన చోట వర్షపు నీటి రీచార్జ్ పిక్స్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లో రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాల్టా యాక్టివ్ పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీవో వీవీ అప్పారావు, భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శివధర్మతేజ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అరుణాకర్ రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలూనాయక్, డీపీవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.