డాక్టర్లు అంకితభావంతో డ్యూటీ చేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

డాక్టర్లు అంకితభావంతో డ్యూటీ చేయాలి : కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్

వనపర్తి టౌన్, వెలుగు : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్  సూచించారు. డాక్టర్స్​ డే సందర్భంగా కేక్​ కట్​ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైద్యులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైందని, అంకితభావంతో సేవలందించి మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి బాలింతలు, పిల్లలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.

 ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవసరమైన సౌలతులు, వైద్య సిబ్బంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్, నర్సింగ్  కాలేజీలతో పాటు డయాగ్నోస్టిక్  సెంటర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. పట్టణ సమీపంలోని నల్లచెరువును పరిశీలంచి, ఆహ్లాదం పంచేలా పరిసరాలను సిద్ధం చేయాలని సూచించారు. డీఎంహెచ్ వో డాక్టర్ రవిశంకర్, మున్సిపల్  కమిషనర్  విక్రమ్  సింహా రెడ్డి, డాక్టర్  నరేంద్ర కుమార్, డాక్టర్  రాజ్ కుమార్  పాల్గొన్నారు.