ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి  :  కలెక్టర్ ఇలా  త్రిపాఠి

నార్కట్​పల్లి, వెలుగు : ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఇలా  త్రిపాఠి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నార్కట్ పల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్ సీ, మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం ప్రసవాలు, గర్భిణుల సంఖ్య, ఏఎన్ సీ పరీక్షలు, కుక్క కాట్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ప్రజలు వీధికుక్కల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను  పెంచాలని చెప్పారు. అంతకుముందు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. 

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి 

నల్గొండ అర్బన్ : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో  2017, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 33,600 మరణాలు సంభవించగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 3,121 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.