
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం తరలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ లారీ కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో ధాన్యం ఎగుమతి తరలింపుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు మద్దతు ధరను కల్పిస్తూ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని లారీ కాంట్రాక్టర్లు ఎక్కువ లారీలను పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు, రైతులకు సహకరించాలని కోరారు. డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌రావు, సివిల్సప్లయ్ఆఫీసర్సురేశ్రెడ్డి, మేనేజర్ జగదీశ్, లారీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్
చిలప్ చెడ్: పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలప్ చెడ్ లో కలెక్టర్ రాహుల్ రాజ్, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీవో ఆనంద్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిలప్ చెడ్ లో 59 ఇండ్లు మంజూరు కాగా 12 మంది పనులు స్టార్ట్ చేశారన్నారు. బేస్ మెంట్ లెవల్ వరకు పూర్తయిన 4 ఇండ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి తొందరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసిన నేపథ్యంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిలప్ చెడ్ పర్యటించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. చిలప్ చెడ్ (శిలాంపల్లి) రైతువేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.