కాగజ్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీకి రెడీ చేయండి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

 కాగజ్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీకి రెడీ చేయండి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో అన్ని వసతులు కల్పించి, లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశిం చారు. గురువారం కాగజ్ నగర్  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి ఆమె ఆఫీస్​లో విద్యుత్, రోడ్లు భవనాలు, హౌసింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. బోరిగాం శివారులో మొత్తం 12 బ్లాకుల్లో 228 డబుల్​బెడ్రూం ఇండ్లను నిర్మించామని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

విద్యుత్, నీరు, పెయింటింగ్, కిటికీలు, తలుపులు, అంతర్గత రహదారుల నిర్మాణాలు, ఇతర పనులన్నీ త్వరగా పూర్తిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ శేషరావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, తహసీల్దార్ మధుకర్ తదిత రులు పాల్గొన్నారు.