
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే 3 నెలల కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జిల్లాలో భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.