
ఆసిఫాబాద్, వెలుగు: వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేపడతామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామానికి వెళ్లే రహదారి పైన ఉన్న లో లెవెల్ వంతెన ఇరువైపులా కోతకు గురికావడంతో అడిషనల్ కలెక్టర్ డేవిడ్తో కలిసి పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు.
ప్రజల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే రిపేర్లు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్8500844365ను సంప్రదించాలన్నారు.