ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే 

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే 

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ ​వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పంపుసెట్లు, వ్యవసాయ బావులకు త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని, భూమి కొలతలు చేపట్టి హద్దులు నిర్ధారించాలని, బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించినా బకాయి ఉన్నట్లు నోటీసు జారీ చేశారని న్యాయం చేయాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీలు సమర్పించారు.

దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు 

నస్పూర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై సత్వర చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్​తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతివ్వాలని, ఇందిరమ్మ ఇల్లు బిల్లులు ఇప్పించాలని, తన తల్లి పేరిట భూమి పట్టా మార్పిడి చేయాలని, ఉపాధి కల్పించాలని,  లక్షెట్టిపేట మండలం లింగాపూర్ గ్రామ శివారులోని కాలువను పూడ్చి సాగు చేస్తున్నారని, ఆ కాలువను పునరుద్ధరించాలని, పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటా
మని తెలిపారు. 

టెలిఫోన్, వాట్సాప్ ద్వారా ఆర్జీల స్వీకరణ 

నిర్మల్, వెలుగు: ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్​కు వచ్చి ఇబ్బందులు పడకుండా నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వాట్సాప్ ద్వారా కూడా ఆర్జీలు స్వీకరించారు. ఆ ఆర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులు అందించారు. 91005 77132 నంబరును సంప్రదించి వాట్సాప్ ద్వారా కూడా సమస్యలు పంపవచ్చునని కలెక్టర్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్​లో107 అర్జీలు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్ రాజర్షి షా ప్రజలను అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్​లో వచ్చిన మొత్తం 107 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, తదితర శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తలు వచ్చినట్లు తెలిపారు.