
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సమష్టిగా పనిచేద్దామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డీవీ శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ అంశంలో సమన్వయంతో పనిచేసి ప్రజారక్షణకు కృషి చేద్దామని అన్నారు.