శానిటేషన్పై అశ్రద్ధ చేయొద్దు : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

శానిటేషన్పై అశ్రద్ధ చేయొద్దు : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్‌‌‌‌, వెలుగు : ఇందూర్ నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్​పై అశ్రద్ధ చేయొద్దని, నిత్యం పనులు సాగేలా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఆయన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌లో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు పారిశుధ్య సిబ్బంది హాజరును పరిశీలించాలని, డివిజన్ వారీగా పనులను సమీక్షించాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు అవెన్యూ ప్లాంటేషన్​పై ఫోకస్ పెట్టాలన్నారు.

 డ్రైనేజీ క్లీనింగ్‌‌‌‌కి జేసీబీలు ఉపయోగించాలని, నగరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులు ఉంటే మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పించాలన్నారు.   సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)  అంకిత్, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి తదితరులు  పాల్గొన్నారు.