నల్గొండ జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి , సూర్యాపేట అదనపు కలెక్టర్ కే. సీతారామారావు జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు.  సోమవారం ఆయా కలెక్టరేట్లలోని సమావేశ మందిరాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 

సూర్యాపేట ప్రజావాణిలో మొత్తం 57 ఫిర్యాదులు రాగా, నల్గొండ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి మొత్తం 90 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ ఆఫీసర్లకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. 

యాదాద్రి, వెలుగు: యాదాద్రిలో నిర్వహించిన ప్రజావాణికి 17 మండలాల తహసీల్దార్లను కలెక్టర్ హనుమంతరావు పిలిపించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 45 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.