హుజూరాబాద్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హుజూరాబాద్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హుజూరాబాద్ రూరల్, వెలుగు: హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో, తుమ్మనపల్లి ప్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తూకం యంత్రాలు, తేమ యంత్రాల పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈవో సౌమ్య పాల్గొన్నారు,

రైతులకు అవగాహన కల్పించాలి

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: ధాన్యం నాణ్యతపై  రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోలు చేసి వడ్లను కేటాయించిన రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఆత్మనగర్ మహిళా సమాఖ్య ఐకేపీ సెంటర్,  ఆత్మకూరు, మెట్ల చిట్టాపూర్ ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మెట్‌‌‌‌‌‌‌‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో పీడీ రఘువరన్, జిల్లా కోపరేటివ్ డీసీవో మనోజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.