ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు:  ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్​ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీసులో రెడ్ క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు ఆఫీసర్లు రక్తదానం చేశారు.అనంతరం  కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు.  నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులు రక్తదానానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్పీ బి.శ్రీనివాస్‌‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం, రెడ్​క్రాస్ సోసైటీ చైర్మన్ ఎం.రాజన్న, సెక్రటరీ రఘుకుమార్, ప్రతినిధులు బాలు, రమేశ్‌‌రెడ్డి పాల్గొన్నారు.  

ఉప ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌కు బుద్ది చెప్పండి

నిజామాబాద్,  వెలుగు: రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌కు ఉప ఎన్నికలో తగిన  బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ధన్‌‌పాల్‌‌ ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు మునుగోడులో రాజగోపాల్‌‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, బీజేపీ లీడర్లు గోపిడి వినోద్‌‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, అమందు విజయ్‌‌కృష్ణ, దాత్రిక రమేశ్‌‌,  భాస్కర్‌‌‌‌రెడ్డి, కాలేరు దినేశ్‌‌, సాయి, ముత్యం పాల్గొన్నారు.

పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలి

భిక్కనూరు, వెలుగు: మండలంలోని జంగంపల్లిలోని ప్రభుత్వ స్థలాన్ని ఇండ్లులేని పేదలకు పంచాలని డిమాండ్‌‌ చేస్తూ బుధవారం గ్రామస్తులు తహసీల్దార్‌‌‌‌ నర్సింహులుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహులుయాదవ్​ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం గ్రామంలోని కొందరు ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించిందని, వాటికి సంబంధించిన పట్టాలు ఇవ్వడంతో పాటు కొత్త వారికి కూడా స్థలాలు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ యశోద, విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

లింగంపేట, వెలుగు: మండలంలోని మెంగారం, కన్నాపూర్, బోనాల్ గ్రామాల్లో  ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం జడ్పీటీసీ ఏలేటి శ్రీలత, ఎంపీపీ గరీబున్నీసా ప్రారంభించారు. భవానీపేట, జల్దిపల్లి, పర్మల్ల గ్రామాల్లో లింగంపేట సింగిల్​విండో చైర్మన్​ దేవేందర్‌‌‌‌రెడ్డి కొనుగోలు సెంటర్లను షురూ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రైతులు బాగా ఆరబెట్టిన వడ్లను తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్​ మాకంరాములు, సీఈవో సందీప్, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.

నార్మల్ డెలివరీలు ఇంకా పెంచాలి

కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీల సంఖ్య ఇంకా పెంచాలని కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ దఫేదర్ శోభ పేర్కొన్నారు. గురువారం జడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌‌‌‌లు జరిగాయి. రూరల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, పనులు, ఆర్థిక శాఖ, విద్య, వైద్య విభాగాలపై ఆయా కమిటీల మెంబర్లు చర్చించారు. ఆయా శాఖల పనితీరును రివ్యూ చేశారు. ‘మన ఊరు మన బడి’ ప్రోగ్రామ్‌‌‌‌ కింద 351 స్కూళ్లకు సెలక్ట్ చేయగా రూ.3.94 కోట్ల ఫండ్స్‌‌‌‌ను ఎస్ఎంసీ అకౌంట్లలో జమ చేసినట్లు డీఈవో రాజు తెలిపారు. జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అనుసంధానం అయినందున 28 మంది సీనియర్ రెసిడెంట్‌‌‌‌ డాక్టర్లు వచ్చారని డీసీహెచ్‌‌‌‌వో డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 14 పీహెచ్‌‌‌‌సీ రిపేర్లకు రూ.2.45 కోట్ల ఫండ్స్​వచ్చినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. జడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆయా శాఖల ఆఫీసర్లు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.  

జిల్లాకు రానున్న ట్రైనీ ఐఏఎస్‌‌లు

నిజామాబాద్,  వెలుగు: శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌‌ల బృందం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌‌‌‌ సి.నారాయణరెడ్డి చెప్పారు. ఈ నెల 31 నుంచి నవంబర్‌‌‌‌ 5వ తేదీ వరకు ఆరు రోజుల పాటు వారు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. వారి రాక కోసం ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్రైనీ ఆఫీసర్లు జిల్లాలోని దర్పల్లి మండలం దుబ్బాక, కోటగిరి మండలం ఎత్తొండ, ఆలూరు మండలం మిర్దాపల్లి, జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్, కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తారని తెలిపారు. వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, డీఎంహెచ్‌‌వో డాక్టర్ సుదర్శనం, ఏసీపీలు, ఆర్డీవోలు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. 

ప్రతి స్కూల్‌‌లో బయోమెట్రిక్ తప్పనిసరి

పిట్లం, వెలుగు: ప్రతి స్కూల్‌‌లో బయోమెట్రిక్​ తప్పని సరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈవో దేవీసింగ్ హెచ్‌‌ఎంలను ఆదేశించారు. గురువారం ఎమ్మార్సీ బిల్డింగ్‌‌లో మండలంలోని హెచ్‌‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు బయోమెట్రిక్​వివరాలను నమోదు చేసి మెస్సేజ్‌‌ ద్వారా తెలియజేయాలన్నారు. నవంబర్ ఒకటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఇందు కోసం స్టూడెంట్లను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి నెల మూడో శనివారం టీచర్లు, పేరెంట్స్ మీటింగ్‌‌లను ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ ఆఫీసర్ ఆనంద్ మాట్లాడుతూ పిల్లల అభ్యాసన స్థాయిని పరిశీలించి ఆన్‌‌లైన్‌‌లో నమోదు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అనంతరం స్కూల్ వారీగా ఎఫ్ఎల్ఎన్‌‌పై రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో  కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ గణేశ్‌‌రావు, సీఆర్పీలు గోపాల్, హైమద్ పాషా పాల్గొన్నారు.

ఆర్మూర్ హాస్పిటల్‌‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ వంద పడకల హాస్పిటల్‌‌లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌‌కుమార్ చెప్పారు. టౌన్‌‌లోని వంద పడకల హాస్పిటల్‌‌ను గురువారం ఆయన పరిశీలించారు. వార్డుల్లో సౌకర్యాలు, సమస్యలు తెలుసుకుని డాక్టర్లతో రివ్యూ మీటింగ్ జరిపారు. అనంతరం మాట్లాడుతూ హాస్పిటల్‌‌లో డాక్టర్లు​, పేషంట్లు చెప్పిన సమస్యలను వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగరాజు, డాక్టర్లు అమృత్ రాంరెడ్డి, సుమన్, వెంకటరమణ, శ్రీలత పాల్గొన్నారు.

టీఆర్ఎస్‌‌వి చిల్లర రాజకీయాలు

నిజామాబాద్ టౌన్, వెలుగు: మునుగోడు ఓటమి భయంతోనే టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మదాసు స్వామియాదవ్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఓటమి తప్పదని ఇంటిలిజెన్స్ ద్వారా తెలుసుకుని సీఎం కేసీఆర్‌‌‌‌ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. బీజేపీ ఒక క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని విమర్శించారు. అవినీతి రాజకీయాలు చేస్తున్న టీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.