పవన్కు చిరంజీవి తరువాత నేనే : కమెడియన్ సుధాకర్

పవన్కు చిరంజీవి తరువాత నేనే : కమెడియన్ సుధాకర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కమెడియన్స్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు సుధాకర్(Sudhakar). తనదైన కామెడీ టైమింగ్ తో, అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను తెగ నవ్వించేవాడు. టాలీవుడ్ టాహీరోలందరితో కలిసి నటించిన సుధాకర్.. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక తాజాగా  ఫాదర్స్ డే సందర్భంగా తన కొడుకు బిన్నీతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawarstar Pawankalyan) గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

"చిరంజీవికి తనంటే చాలా ఇష్టమని చెప్పిన సుధాకర్.. తనకు ఎలాంటి అవసరం వచ్చినా చిరు వెంటనే స్పందిస్తారని తెలిపాడు. "సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిరంజీవి, నేను ఒకే రూములో ఉండేవాళ్లం. అప్పటి నుంచి మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మా మధ్య చిన్న గొడవ కాదు కదా కనీసం అలాంటి రూమర్ కూడా రాలేదు. ‘యముడికి మొగుడు(Yemudiki mogudu)’ సినిమాలో నేను ఖచ్చితంగా ఉండాలని చిరంజీవి పట్టుపట్టి మరీ యాక్ట్ చేయించాడు. పవన్ కళ్యాణ్ కూడా నన్ను అన్నయ్య,అన్నయ్య అంటూ పిలిచేవాడు. పవన్ కు చిరంజీవి తరువాత నేనే అన్నయ్యను అని చెప్పుకొచ్చాడు సుధాకర్.

ప్రస్తుతం సుధారం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.