వెంకటగిరిలో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం

వెంకటగిరిలో సీసీఐ కొనుగోలు సెంటర్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు సెంటర్ ను బుధవారం వ్యవసాయ మార్కెట్ జిల్లా అధికారి ఎంఏ అలీమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు లూజ్ పత్తిని సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చే సమయంలో అరబెట్టి 8 నుంచి 12 శాతం వరకు తేమ శాతం ఉండే విధంగా తీసుకురావాలని సూచించారు.

సీసీఐ కొనుగోలు కేంద్రంలో క్వింటాకు రూ.7020 మద్దతు ధర చెలిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఐ కాటన్ పర్చేజ్ ఆఫీసర్ అవినాష్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్ వన్ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం, సహాయ కార్యదర్శి ఎండీ.వజీరుద్దీన్, కాటన్ మిల్లు ఓనర్ జీఆర్​నాగేశ్వరరావు పాల్గొన్నారు.