తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింది.19 కేజీల వాణిజ్య సిలిండర్పై  రూ.135 చొప్పున తగ్గించారు. దీంతో దాని ధర హైదరాబాద్లో రూ.2,656.50,  ఢిల్లీలో రూ.2,219, కోల్ కతాలో రూ.2,322, ముంబైలో రూ.2,171.50, చెన్నైలో రూ.2,373 కు తగ్గింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ప్రతినెలా మొదటివారంలో, మూడోవారంలో గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా ధరలను అప్ డేట్ చేస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ ధర కొంతమేర తగ్గడమనేది, వాటిని నిత్యం వినియోగించే చిన్నతరహా వ్యాపారులకు ఊరటనిచ్చే విషయంగా పరిగణించవచ్చు. కాగా, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఈ ఏడాదిలో రెండుసార్లు పెరిగింది. ఏప్రిల్ 1న రూ.250, మార్చి 1న రూ.105 మేర పెరిగింది. అయితే గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధర మారలేదు. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,003 వద్ద ఉంది. 

 

 

 

మరిన్ని వార్తలు..

సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కన్నుమూత

డ్రాతో సరిపెట్టుకున్న ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌