హోటల్స్ ఖుషీ : పెద్ద గ్యాస్ బండ కూడా 158 రూపాయలు తగ్గింది

హోటల్స్ ఖుషీ : పెద్ద గ్యాస్ బండ కూడా 158 రూపాయలు తగ్గింది

ఆయిల్ మార్కెటెంగ్ కంపెనీలు 2023 సెప్టెంబర్ 1న వినియోగదారలకు గుడ్ న్యూస్ చెప్పాయి.  గ్యాస్ సిలిండర్ ధరలను తాజాగా తగ్గించేశాయి. ఏకంగా రూ.157కు తగ్గిస్తూ నిర్ణయించింది.  రేట్ల తగ్గింపుతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,522 గా ఉంది. అంతకుముందు ఈ రేటు రూ. 1680గా ఉండేది.  

అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి ఈ సబ్సిడీ అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,103 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సబ్సిడీతో రూ. 703 కే లభించనుంది. ఈ స్కీమ్  ద్వారా దేశంలో మొత్తం 33 కోట్ల మంది ప్రయోజనం కలగనుంది.  

మరోవైపు మధ్యప్రదేశ్​ప్రభుత్వం మద్యతరగతి ప్రజలకు శ్రావణమాసం ఆఫర్​ను ప్రకటించింది. జూలై 4 నుంచి ఆగస్టు 31 వరకు గ్యాస్​సిలిండర్​తీసుకున్నవారి నుంచి రూ.450 మాత్రమే వసూలు చేయనుంది. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేయనుంది. మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​చౌహాన్​ అధ్యక్షతన భోపాల్​లో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్​లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.