భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : అనిల్ కుమార్

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం :  అనిల్ కుమార్

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి, జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ నాగరాజుతో కలసి జాతర బ్రహ్మోత్సవాల్లో భద్రత, పార్కింగ్ తదితర విషయాలపై చర్చించారు. అనంతరం  ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని ఈవో బాలాజీ ని ఆదేశించారు. స్వామి వారి కల్యాణానికి వచ్చే భక్తులకు అక్షింతలు అందించాలన్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో  పలువురు అధికారులు పాల్గొన్నారు. 

ఆలయ బ్రహ్మోత్సవాల సమీక్ష 

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం, బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశాన్ని ఈనెల 30న దుద్దెడ శివారులోని మినర్వా హోటల్​లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరవుతారన్నారు.