అట్టహాసంగా కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ప్రారంభం

 అట్టహాసంగా కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ప్రారంభం

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌: నాలుగేళ్లకు ఓసారి జరిగే కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అలెగ్జాండర్‌‌‌‌ స్టేడియంలో గురువారం ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీ గ్రాండ్‌‌‌‌గా జరిగింది. బ్రిటిష్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ ఐకాన్‌‌‌‌ డురాన్‌‌‌‌ డురాన్‌‌‌‌ తన పాప్‌‌‌‌ సంగీతంతో హోరెత్తించాడు. డురాన్‌‌‌‌ డురాన్‌‌‌‌తో పాటు బ్లాక్‌‌‌‌ సబ్బాత్‌‌‌‌కు చెందిన టోనీ ఐయోమీ, లోకల్‌‌‌‌ ర్యాపర్స్‌‌‌‌ ఇండిగో మార్షల్‌‌‌‌, గాంబిని ఇందులో పాల్గొన్నారు. బ్రిటన్‌‌‌‌ ప్రిన్స్‌‌‌‌ చార్లెస్‌‌‌‌.. విక్టోరియా స్క్వేర్‌‌‌‌లో ఫెస్టివల్‌‌‌‌ సైట్‌‌‌‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పెర్ఫామెన్స్‌‌‌‌ చూసి వాళ్లతో ముచ్చటించారు. ఈ సెర్మనీలో 2 వేల మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారు. గేమ్స్‌‌‌‌ సందర్భంగా మొత్తం 14 వేల మంది తమ సేవలను అందించనున్నారు. మరోవైపు ఇండియా బృందం... గేమ్స్‌‌‌‌ విలేజ్‌‌‌‌లో ఫ్లాగ్‌‌‌‌ హోస్టింగ్‌‌‌‌ సెర్మనీని ఘనంగా నిర్వహించింది. ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీలో పంజాబ్‌‌‌‌ పాటకు భంగ్రా డ్యాన్స్‌‌‌‌ను చేశారు. బాణసంచా వెలుగులతో, పాప్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ హోరుతో స్టేడియం దద్దరిల్లింది. బ్రిటిష్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ తమ జాతీయ జెండాలతో స్టేడియంలో అలరించారు. గేమ్స్‌‌‌‌ మస్కట్‌‌‌‌ ఫెర్రీ.. స్టేడియంలో కలియదిరుగుతూ ఫ్యాన్స్‌‌‌‌కు అభివాదం చేసింది. లెన్నీ హెన్రీ... క్వీన్స్‌‌‌‌ బ్యాటన్‌‌‌‌తో స్టేడియంలోకి ప్రవేశించాడు.