ఇండ్లు అమ్మి ఉద్యోగులకు జీతాలు!

ఇండ్లు అమ్మి ఉద్యోగులకు జీతాలు!

న్యూఢిల్లీ: ఒకప్పుడు దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ కంపెనీగా పేరు తెచ్చుకున్న బైజూస్‌‌‌‌‌‌‌‌, ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతోంది.  కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైజూ రవీంద్రన్ తన ఇల్లు, తన కుటుంబీకుల ఇండ్లను తాకట్టు పెట్టి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని తెలిసింది.   ఆయన కుటుంబానికి చెందిన బెంగళూరులోని రెండు ఇండ్లు,  కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  ఒక విల్లాను తనఖాగా పెట్టి 12 మిలియన్ డాలర్ల (రూ.100 కోట్ల)  లోన్ తీసుకున్నారని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. 

కంపెనీ మొత్తం 15 వేల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీని నిలబెట్టేందుకు బైజూ రవీంద్రన్ అనేక కష్టాలు పడుతున్నారు. ఒకప్పుడు బైజూస్ వాల్యుయేషన్ 22 బిలియన్ డాలర్లు పలికింది.  ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల కంటే తక్కువ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. అప్పుల ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు బైజూస్ తన యూఎస్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను అమ్మాలని చూస్తోంది. 400 మిలియన్ డాలర్లకు దీన్ని అమ్మకానికి పెట్టింది. కంపెనీ 1.2 బిలియన్ డాలర్ల విలువైన టెర్మ్‌‌‌‌‌‌‌‌ లోన్లను తీర్చడంలో  ఇబ్బందులు పడుతోంది. ఈ అప్పుపై వడ్డీ చెల్లించకపోవడంతో  లీగల్ సమస్యలు ఎదుర్కొంటోంది. బైజూ రవీంద్రన్ సంపద ఒకానొక టైమ్‌‌‌‌‌‌‌‌లో 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

కంపెనీలోని తన వాటాలను తనఖా పెట్టి 400 మిలియన్ డాలర్ల పర్సనల్ లోన్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. గతంలో వాటాలను అమ్మడం ద్వారా వచ్చిన 800 మిలియన్ డాలర్లను  తిరిగి కంపెనీలోనే ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.  కిందటి నెలలో బైజూస్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కంపెనీకి 2021–22 ఆర్థిక సంవత్సరంలో  రూ.2,253 కోట్ల నష్టం వచ్చింది.