నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్‌లో కంపెనీ లెవల్ వాలీబాల్ పోటీలులో పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రగతి స్టేడియంలో జరిగిన పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని జట్లు పాల్గొన్నాయి. శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జీఎం టి.శ్రీనివాస్ప్రారంభించి మాట్లాడారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సింగరేణి కృషి చేస్తోందని, అందుకే క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు.
క్రీడలతో శారీరక, మానసిక ధృడత్వం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా, ఆఫీసర్ల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం అరవిందరావు, క్రీడల గౌరవ కార్యదర్శి సృజన్ పాల్, అన్ని ఏరియాల స్పోర్ట్స్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.