నాట్కోకు దండిగా లాభాలు

నాట్కోకు దండిగా లాభాలు

ప్రముఖ ఫార్మా కంపెనీ నాట్కో ఫార్మా లిమిటెడ్‌ సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్యూ 2లో అదరగొట్టింది. ఈ త్రైమాసికానికి కంపెనీ నికరలాభం అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 181.60 కోట్లకు చేరిం ది. సెప్టెం బర్‌‌‌‌ 2017తో అంతమైన త్రైమాసికంలో నాట్కో ఫార్మాకు రూ. 84.40 కోట్ల నికరలాభం వచ్చిం ది. ఈ ఏడాది
క్యూ2లో కంపెనీ ఆదాయం కూడా అంతకు ముం దు ఏడాది క్యూ2లోని రూ. 432.20 కోట్ల నుంచి రూ. 583.50 కోట్లకు పెరిగిం ది. ఫార్ములేషన్‌ విభాగం దేశంలోనూ, ఎగుమతుల మార్కెట్ లో నూ ప్రోత్సాహకరమైన పనితీరు ప్రదర్శించి నట్లు నాట్కో ఫార్మా
తెలిపింది. దేశీయ ఫార్ములేషన్‌ అమ్మకాలు రూ.193.87 కోట్లుం డగా, ఎగుమతులు రూ. 247.81 కోట్లున్నాయి. ఏపిఐ విక్రయాలు రూ. 66.81 కోట్లు,ఇతర ఆపరేటింగ్‌ ఆదాయం రూ. 53.61 కోట్లు, సబ్సిడియరీల ఆదాయం రూ. 21.40 కోట్లుగా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదయ్యాయి.రూ.250 కోట్లతో బైబ్యాక్‌‌‌‌ సోమవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు రూ. 250
కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌‌‌‌ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిం ది. షేర్‌‌‌‌ ఒక్కింటికి రూ. వెయ్యి మించకుం డా,పెయిడప్‌ ఈక్వి టీలో మ్యాగ్జిమం 8.22 శాతం దాకా ఈ బైబ్యాక్‌‌‌‌ను ప్రతిపాదిస్తున్నారు. రూ.2 ముఖవిలువున్న నాట్కో ఫార్మా షేర్‌‌‌‌ సోమవారం రూ.6.25
లాభపడి రూ.779.70 వద్ద ముగిసిం ది. ఈ షేర్‌‌‌‌ 52 వారాల హై రూ.1,061.95 కాగా, లో రూ. 637.40.షేర్ల బైబ్యాక్‌‌‌‌ రెగ్యులేషన్స్‌‌‌‌కు అనుగుణంగా మిగిలిన వివరాలను తర్వాత ప్రకటించనున్నట్లు నాట్కో ఫార్మావెల్లడించిం ది. కంపెనీ ఈక్వి టీ (8,90,81,645 షేర్లు)లో ప్రమోటర్లకు 48.25 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌‌‌‌కు 6.16 శాతం, ఎఫ్‌ పి ఐలకు 24.31 శాతం,
బాడీ స్‌ కార్పొరేట్‌‌‌‌కు 2.66 శాతం, ఇండియన్‌ పబ్లిక్‌‌‌‌కు 17.85 శాతం, ఎన్‌ ఆర్‌‌‌‌ఐలకు 0.77 శాతం వాటాలు వున్నాయి. ప్రతిపాదిత బైబ్యాక్‌‌‌‌ అనంతరం ప్రమోటర్ల వాటా 48.91 శాతానికి పెరు గుతుంది.