మూడు వారాల్లో పరిహారం చెల్లించాలి: హైకోర్టు

మూడు వారాల్లో పరిహారం చెల్లించాలి: హైకోర్టు

 హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపల్లిలో బడి, బస్టాండ్, వాటర్‌‌‌‌‌‌‌‌ ట్యాంకుల నిర్మాణానికి చేసిన భూసేకరణ పరిహారం 3 వారాల్లోగా చెల్లించాలని ఆ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతరులను హైకోర్టు ఆదేశించింది. లేకుంటే కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం చెల్లించాలని 2022 ఆగస్టులో వెలువరించిన తీర్పును అమలు చేయలేదంటూ గోపాలపురానికి చెందిన రహీముద్దీన్‌‌‌‌‌‌‌‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, దీనిని జస్టిస్‌‌‌‌‌‌‌‌ బి.విజయ్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌రెడ్డి శుక్రవారం విచారించారు.

 85 ఏండ్ల వృద్ధుడి భూమిని ప్రజావసరాల కోసం తీసుకుని పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్న అధికారులు ఈసారైనా తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో తదుపరి విచారణకు స్వయంగా విచారణకు హాజరుకావాలన్నారు. విచారణను ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 12కి వాయిదా వేశారు.