దళిత బస్తీ అక్రమాలపై ఫిర్యాదు

దళిత బస్తీ అక్రమాలపై ఫిర్యాదు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  బేల మండలంలోని పాటన్ గ్రామంలో లబ్ధిదారులకు అందించిన దళితబస్తీ భూముల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శుక్ర వారం అడిషనల్​​ కలెక్టర్​ శ్యామలాదేవికి  యూత్​ కాంగ్రెస్​ నాయకుడు సామ రూపేశ్​ రెడ్డి  ఫిర్యారు చేశారు.  కాడే వర్ష అనే మహిళ ప్రభుత్వ అసైన్డ్ భూమిని తనదిగా చెప్పుకొని దళిత బస్తీ పథకంలో విక్రయానికి పెట్టారని తెలిపారు. 

 సర్వే నంబర్ 32/2 లో గల ఈ భూమిని కొబ్బయి గ్రామానికి చెందిన కొండ్రావార్ రేఖబాయి అనే లబ్ధిదారుడికి అధికారులు కేటాయించారని పేర్కొన్నారు. కాగా వర్షకు 3 ఎకరాలకు గాను ప్రభుత్వం రూ.15 లక్షలు చెల్లించిందన్నారు. అయితే ఇది అసైన్డ్ భూమి కావడంతో  లబ్ధిదారులకు పట్టా కావడం లేదన్నారు. రైతుబంధు,రైతు బీమా తో పాటు ఇతర పథకాలు అందడం లేదన్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.  అసలైన లబ్ధిదారుకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో  బాపూరావు,  నాందేవ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.