ధరణి పోర్టల్ రద్దు చేయండి.. సరూర్ నగర్‭లో కాంగ్రెస్ ఆందోళన

ధరణి పోర్టల్ రద్దు చేయండి.. సరూర్ నగర్‭లో కాంగ్రెస్ ఆందోళన

ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు.. సరూర్ నగర్, RK పురం డివిజన్ కాంగ్రెస్ నాయకులు.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు దేప భాస్కర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. 

రైతుల సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దేప భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఎవరి లబ్ది కొరకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ప్రశ్నించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‭కు రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములను దొరల పాలు చేశారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు.