
- ప్రయాణికుల ఇబ్బందులు
మెదక్, వెలుగు: హైర్బస్డ్రైవర్ల ఆందోళనతో మెదక్ డిపో పరిధిలో దాదాపు 60 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం బొడ్మట్‌పల్లి నుంచి మెదక్ వస్తున్నబస్ డ్రైవర్‌పై టేక్మాల్మండలం సాలోజిపల్లి వద్ద ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడని హైర్బస్ డ్రైవర్లు ఆరోపించారు.
మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో విపరీతంగా రద్దీ ఉంటోందని, ప్యాసింజర్లు ఫుట్ బోర్డు పై నిల్చుంటుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇది డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారిందన్నారు. బస్ కెపాసిటీకి సరిపడ ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకునేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటేనే తాము బస్‌లు నడిపిస్తామని హైర్ బస్ డ్రైవర్లు తెలిపారు. ఆర్టీసీ అధికారులు వారితో చర్చలు జరిపి సమస్య లేకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.