సేవ చేసే అవకాశం ఇవ్వండి : మిథున్​రెడ్డి

సేవ చేసే అవకాశం ఇవ్వండి : మిథున్​రెడ్డి

మహబూబ్​నగర్ రూరల్, వెలుగు: తనకు అవకాశం ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పించాలని మహబూబ్​నగర్​ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్​ రెడ్డి ఓటర్లను కోరారు. కోటకదిర గ్రామం బీజేపీకి కంచుకోటలా మారాలన్నారు. మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని మన్యంకొండ, ఓబులాయపల్లి, ఓబులాయపల్లి తండా, కోటకదిర, పోతన్​పల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు మన్యంకొండ ఆలయాన్ని మిథున్​ రెడ్డి, రిషిక దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

నియోజకవర్గంలోని ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు మిథున్​రెడ్డి చెప్పారు. కాగా జిల్లా కేంద్రంలోని బాయ్స్​ కాలేజ్​ గ్రౌండ్​లో మార్నింగ్​ వాకర్స్​తో మాట్లాడారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సైక్లింగ్​ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రూరల్​ మండలంలోని హోటల్​ వద్ద పూరీలు చేశారు.