మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా

మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నప్పటికీ వైరస్ రికవరీలు కూడా అంతే సంఖ్యలో పెరగుతుండటం శుభపరిణామంగా చెప్పొచ్చు. అయితే కరోనా పేషెంట్స్‌‌తో పాటు రికవరీల్లో పలు ఆరోగ్య సమస్యలు వస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. జాన్ హాప్కిన్స్ రిపోర్ట్ ప్రకారం.. కరోనా పేషెంట్స్, రికవరీల్లో గందరగోళం, వాసన తెలియకపోవడం, ప్రవర్తనలో మార్పులు లాంటి సమస్యలు ఆలస్యంగా బయటపడుతున్నాయని తెలుస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన పేషెంట్స్‌‌లో మతిమరుపు రావడం, ఆందోళన చెందడాన్ని సైంటిస్టులు గమనించారు. గుండె నొప్పి, మెదడులో రక్తస్రావం కావడం, మెమొరీ కోల్పోవడం లాంటి మరికొన్ని తీవ్రమైన పరిణామాలను కొందరు కరోనా పేషెంట్స్‌‌లో గుర్తించారు. దాదాపు సగం మంది కరోనా పేషెంట్స్‌‌లో న్యూరొలాజికల్ లక్షణాలను గమనించిన సైంటిస్టులు.. వైరస్ వల్ల మెదడుకు ప్రమాదం ఎలా ఏర్పడుతుందనేది అర్థం కావడం లేదంటున్నారు. మెదడు పై కరోనా ప్రభావం చూపుతుండటంతోనే గందరగోళానికి లోనవడం, గుండె సంబంధిత సమస్యలు రావడం, రుచి, వాసనను కోల్పోవడం, తలనొప్పి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.