రాజస్థాన్‌లో రిసార్ట్‌ రాజకీయాలు

రాజస్థాన్‌లో రిసార్ట్‌ రాజకీయాలు
  • ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించిన కాంగ్రెస్‌
  • బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపణ

జైపూర్‌‌: రాజ్యసభ ఎన్నికల వేళ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. మధ్యప్రదేశ్‌లో ఎదురైన ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తోందని, ఒక్కొకరికి రూ.25 కోట్లు ఆఫర్‌‌ చేసిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ఢిల్లీ – జైపూర్‌‌ హైవేలోని రిసార్ట్‌కు తరలించారు. రాజస్థాన్‌లో ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడుస్థానాలు ఎన్నికలు జరగనున్నాయి.