జాబ్ క్యాలెండర్ .. డేట్లతో పాటు విడుదల చేసిన కాంగ్రెస్

జాబ్ క్యాలెండర్ ..  డేట్లతో పాటు విడుదల చేసిన కాంగ్రెస్
  • ఏటా ఒక్కసారే రిజిస్ట్రేషన్ ఫీజు.. పరీక్షలకు నో ఫీజు 

హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చినంక మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఆరు నెలల్లో మెగా డీఎస్సీ వేసి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను నింపుతామని తెలిపింది. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది. తొలి ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను డేట్లతో సహా విడుదల చేసింది. గ్రూప్​1, గ్రూప్​2 సహా ఏయే ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు భర్తీ చేసేది అందులో పేర్కొంది. పబ్లిక్​సర్వీస్​కమిషన్, స్పెషల్​డిపార్ట్​మెంట్​నియామకాల ద్వారా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా జాబ్ రిక్రూట్ మెంట్ పరీక్షలకు అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏటా ఒక్కసారే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది. 

నిరుద్యోగులకు ఇచ్చిన మరిన్ని హామీలు.. 

ఒక్కసారి ఫీజు కట్టి పబ్లిక్ ​సర్వీస్​ కమిషన్​లో పేరు నమోదు చేసుకుంటే, ఆ ఏడాదిలో రాసే ఏ పరీక్షకూ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగ యువతకు అవకాశం.
ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక వార్డు, దానికి అనుబంధంగా ఉపాధి నైపుణ్య కేంద్రం ఏర్పాటు.  
నిరుద్యోగులు పోటీ పరీక్షల సన్నద్ధమయ్యేందుకు అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు.
యువతకు స్వయం ఉపాధి అందించేందుకు రూ.వెయ్యి కోట్లతో ‘రూరల్ యూత్​ఫైనాన్స్​కార్పొరేషన్’​ ఏర్పాటు.