
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు
కరీంనగర్, వెలుగు: పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. సంబురాల్లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, శ్రీనివాస్ రెడ్డి, ఖంరోద్దీన్, పద్మ, పోచయ్య, మహమ్మద్, తిరుమల, నరేశ్, తిరుపతి పాల్గొన్నారు.