అవినీతి బీఆర్ఎస్​ను తరిమికొట్టండి : జగదీశ్వర్ గౌడ్

అవినీతి బీఆర్ఎస్​ను తరిమికొట్టండి : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు : ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్, మియాపూర్, అల్విన్ కాలనీ, మాదాపూర్ డివిజన్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.  

యువత, స్టూడెంట్లు, మహిళలకు ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్​అధికారంగా వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మోసపూరిత మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు.