విజేయుడు అభ్యర్థిత్వంపై ఈసీకి ఫిర్యాదు

విజేయుడు అభ్యర్థిత్వంపై ఈసీకి ఫిర్యాదు
  • విజేయుడు అభ్యర్థిత్వంపై ఈసీకి ఫిర్యాదు
  • ఫీల్డ్ అసిస్టెంట్‌‌గా రాజీనామా చేశారో లేదో క్లారిటీ లేదని కాంగ్రెస్‌‌ లేఖ
  • దీనిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: అలంపూర్​బీఆర్‌‌‌‌ఎస్ క్యాండిడేట్‌‌ విజేయుడు అభ్యర్థిత్వతంపై కాంగ్రెస్‌‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తూనే ఎమ్మెల్యే అభ్యర్థిగా విజేయుడు నామినేషన్ వేశారని ఆరోపించింది. ఆయన నామినేషన్‌‌ను ఆమోదించడం సరికాదని కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌‌‌‌కు సోమవారం కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్‌‌ లేఖ రాశారు. 

బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థిగా ఉన్న విజేయుడు.. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్‌‌గా పని చేస్తున్నారని తెలిపారు. ఆయన రాజీనామాపై కనీస సమాచారం లేదన్నారు. నామినేషన్ల పరిశీలన చివరి రోజు వరకు కూడా విజేయుడు రాజీనామా మీద క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన అభ్యర్థిత్వంపై ఇతర అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అయితే, రిటర్నింగ్ ఆఫీసర్‌‌‌‌కు ఎవరో ఫోన్ చేశారని, ఆ ఫోన్ వచ్చిందో రాలేదో వెంటనే ఆయన నామినేషన్‌‌ను ఆమోదించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని రాజీవ్ కుమార్‌‌‌‌ను ఆయన కోరారు.