
రాజదండం (సెంగోల్) వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాజదండం వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. సెంగోల్ కు దేశ తొలి ప్రధాని నెహ్రూ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని బీజేపీ ప్రభుత్వం విమర్శించగా..ప్రధాని మోదీ టార్గెట్ గా కాంగ్రెస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా మోదీని అవమానించే విధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
వివాదాస్పద పోస్ట్..
ప్రధాని నరేంద్ర మోడీపై ట్విట్టర్లో కాంగ్రెస్ వివాదాస్పద పోస్ట్ చేసింది. దేశ తొలి ప్రధాని నెహ్రూ పాదాల దగ్గర ప్రధాని మోడీ ఫోటోతో ఓ పోస్టు చేసింది. నెహ్రూ పాదాల వద్ద మోడీ బొమ్మను చిన్నదిగా చూపించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది.
భారతీయులను అవమానించడమే..
కాంగ్రెస్ పోస్టుపై బీజేపీ నేత మంజీందర్ సింగ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్దమైన ప్రధాని పదవిలో ఉన్న మోడీని అవమానించడం కాంగ్రెస్ తీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. ఈ రకమైన పోస్టు దేశంలోని 140 కోట్ల ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు మోడీనే కాకుండా దేశంలోని వెనుకబడిన వర్గాలను అవమానించడమే అని అభిప్రాయపడ్డారు.
బీజేపీ కౌంటర్ పోస్ట్..
మోదీపై కాంగ్రెస్ పోస్ట్ కు కౌంటర్ గా బీజేపీ నెహ్రూ ఫోటోను పోస్ట్ చేసింది. ట్విట్టర్ లో జవహర్ లాల్ నెహ్రూ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నెహ్రూపై కెమెరా ఫోకస్ చేసి ఉంది. అయితే రీల్...రియల్ అంటూ నెహ్రూ ఫోటోపై బీజేపీ ఎద్దేవా చేసింది. నెహ్రూ జీవితం కాంగ్రెస్ పెద్దగా చిత్రీకరించిందని....కానీ నిజ జీవితంలో నెహ్రూ స్థాయి పెద్దది కాదని చురకలంటించింది. బీజేపీ అధికారిక మీడియా హ్యాండిల్ ట్విట్టర్‌లో 'ది ట్రూత్ ఆఫ్ నెహ్రూ' పేరుతో ఫోటోను పోస్ట్ చేసింది.