బీజేపీ హామీలను నమ్మలేం: మల్లికార్జున్ ఖర్గే

బీజేపీ హామీలను నమ్మలేం: మల్లికార్జున్ ఖర్గే

భారతీయ జనతాపార్టీ (బీజేపీ) మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.సంకల్ప్ పత్ర పేరుతో బీజేపీ ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ చీప్ మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పోల్ పిచ్ అని అన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ఎంఎస్పీ పెంచుతానని, లీగల్ గ్యారంటీ ఇస్తానని హామీ ఇచ్చారు.. అవి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. మోదీ హయాంలో దేశ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. 

యువత ఉద్యోగాలు లేక వీధిన పడుతున్నారు.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వీటి గురించి ప్రధాని మోదీ ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుకు నమ్మశక్యం కానీ హామీలతో కొత్త మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు.. బీజేపీ మేనిఫెస్టో అంత నమ్మదగినది కాదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 

మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ నేత , ఢిల్లీ మంత్రి అతిషి స్పందించారు. బీజేపీ పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికం అని అన్నారు. దేశం మొత్తం మీద ఆయుష్మాన్ భారత్ కోసం ఖర్చు చేసిన ఆరోగ్య బడ్జెట్ కంటే తక్కువ అన్నారు.

ఢిల్లీలో ఆరోగ్య బడ్జెట్ లో 9వేల కోట్లు కేటాయిస్తే.. దేశం మొత్తం మీద ఆయుష్మాన్ భారత్ కు కేవలం ర.80వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని ఆరోపించారు. నేను పనిచేయలేదని మీరు అనుకుంటే అరవింద కేజ్రీవాల్ కు ఓటువేయొద్ద అని చెప్ప ధైర్యం కేజ్రీవాల్ కు ఉంది. అదే ప్రధాన మోదీకి ఉందా అని అన్నారు. 

భారతీయ జనతాపార్టీ ఆదివారం(ఏప్రిల్ 14) లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది.తాము అధికారంలోకి వస్తే 70ఏళ్ల పైబడిన వృద్దులకు, లింగమార్పిడి వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కవరేజీని వర్తింపజేస్తామని ప్రధాని మోదీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందన్నారు మోదీ. మహిళలు, పేదలు, యువత, రైతుల అభివృద్దే లక్ష్యంగా బీజేపీ ప్రధాన లక్ష్యమని అన్నారు.

ఈ సందర్భంగా మేనిఫెస్టో తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లను నిర్మాంచామన్న మోదీ.. మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామి ఇచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. 

బీజేపీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భార్, గ్లోబల్ మాన్యుఫ్యాకర్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తత శిక్షణ, క్రీడా వికాసం,సంతులిక అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది బీజేపీ.