
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. ముత్యంపేట, బోధన్ చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ మర్చిపోయారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని ఇవ్వలేకపోయారన్నారు. మెట్ పల్లి మండలం బండలింగపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో పుడుతున్న ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఒకే విడతలో చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేసి, వరి ధాన్యానికి రూ.2500 మద్దతు ధర ఇస్తామని చెప్పారు. పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.15,000 అందిస్తామని తెలిపారు.
మరిన్ని వార్తలు..