సర్కార్ బడుల అభివృద్దిపై విద్యాశాఖ కీలక నిర్ణయం

సర్కార్ బడుల అభివృద్దిపై విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణలోని సర్కారు బడుల అభివృద్ది విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్మాల్ రిపేర్లు.. సమ్మర్ హాలిడేస్ లోపు పూర్తి చేసేందుకు ఎమర్జెన్సీ అండ్  మెయింటెనెన్స్ ఫండ్ రిలీజ్ చేయనుంది. ప్రభుత్వం కొత్తగా ఇచ్చే  ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, స్విచ్చులు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీటన్నింటీని ప్రభుత్వం బడుల్లో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనున్నాయి. కలెక్టర్ దగ్గర అందుబాటులో ఉన్న జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు, స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ తో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను..స్కూళ్ల అభివృద్ధికి వాడనున్నారు.

Also Read: ఒక్క కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ..వేల మంది కేజ్రీవాల్ లు పుట్టుకొస్తారు

వచ్చే జూన్ 10లోపు అంటే సమ్మర్ హాలిడేస్ పూర్తి అయ్యేలోపు స్కూళ్ల మరమ్మతులను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా రూపొందించింది. స్కూళ్లల్లో చేపట్టిన లక్ష రూపాయల విలువైన వాటికి డైరెక్టుగా ఎంపీడీవోలే చెల్లింపులు చేయనున్నారు. అంతకు మించితే జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు పొందాల్సి  ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు. గత కొన్నేళ్లు నుంచి పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని చెబుతున్నారు. బడుల్లో కనీసం వాటర్, క్లాస్ రూంలు, తలుపులు, కిటీకీలు, వాష్ రూమ్ క్లీనింగ్ వంటివి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ ఇచ్చే ఈ ఫండ్ తో బడుల్లో అనేక చిన్న చిన్న సమస్యలు పరిష్కరించవచ్చని చెబుతున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.