ఓట్‌‌ చోరీపై సంతకాల సేకరణ : ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ఓట్‌‌ చోరీపై సంతకాల సేకరణ : ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
  • డీసీసీ  ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

నల్గొండ అర్బన్, వెలుగు:  బీజేపీ చేసిన ఓట్ చోరీపై ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న  సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.  గురువారం నల్గొండలోని 31వ వార్డులో  ఓట్ చోరీపై పట్టణ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీజేపీ ఓట్‌‌ చోరీతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు.   రాహుల్ గాంధీ పిలుపు మేరకు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి  మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రతి గ్రామంలో 100 కు పైగా సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్‌‌కు పంపిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15  వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.