
- ఇంద్రవెల్లి సభ విజయవంతం అయ్యింది
హైదరాబాద్: ఇంద్రవెల్లి సభ విజయవంతం అయ్యిందన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. దళిత, గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని..టీఆర్ఎస్ కి ఇంద్రవెల్లి సభతో టీఆర్ఎస్ కు చురుకు తగిలిందన్నారు. జాప్రతినిధులుగా ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇది సరికాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు, కటారులు పట్టుకుని తిరుగుతున్నారా అని ప్రశ్నించారు. నాలుకలు కోస్తాం అంటున్నారు. మాకు కత్తులు దొరకవా? మేము నాలుకలు కోయలేమా?. వివరణ ఇచుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీదన్నారు. తెల్ల రేషన్ కార్డుకు బియ్యం తెచ్చుకుని తినేవారికి బెంజ్ కార్లు ఎలా వచ్చాయన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని అంటున్నారు మీ భాగోతాలు మాకు తెలియవా అని ప్రశ్నించిన శ్రవణ్.. మేము మీ విషయాలు బైట పెట్టలేమా ఇలాంటి రాజకేయాలు నీచమైన సంస్కృతికి దిగజారాయన్నారు. ఏడేళ్లుగా దళిత, గిరిజన ప్రజల నోట్లో మన్ను కొట్టారని..ఇవాళ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. సమష్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని..ఉద్యోగ ఖాళీల విషయంలో ఎందుకు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతారని ప్రశ్నించారు. సమష్యలపై దృష్టి సారించకుండా ఎదురు దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.