కోరుట్ల ఎమ్మెల్యే నుంచి రూ.3 కోట్లు రికవరీ చేయాలి: కాంగ్రెస్ నేత జువ్వాడి

కోరుట్ల ఎమ్మెల్యే నుంచి రూ.3 కోట్లు రికవరీ చేయాలి: కాంగ్రెస్ నేత జువ్వాడి

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ నేత కల్వకుంట్ల విద్యాసాగర్​రావు తమ ఇండ్లు, ఫామ్​హౌస్​లలో 17 మంది బల్దియా సిబ్బందితో పదేండ్లుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల నెలా మెట్​పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల నుంచి వేతనాలు తీసుకుంటున్న శానిటేషన్ సిబ్బందితో ఎమ్మెల్యే సొంత పనులు చేయించుకోవడంపై దుమారం రేగుతోంది.

రూ. 3 కోట్లు రికవరీ చేయాలి: జువ్వాడి కృష్ణారావు 

శానిటేషన్ సిబ్బందితో రూల్స్​కు విరుద్ధంగా సొంత పనులు చేయించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన తండ్రి విద్యాసాగర్ రావు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు డిమాండ్ ​చేశారు.  సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోరుట్ల, మెట్​పల్లి బల్దియాల ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు.  దాదాపు 17 మంది లేబర్లకు ప్రతి నెలా సుమారు రూ.3లక్షలను బల్దియా నుంచి చెల్లించారని, ఈ పదేండ్లలో రూ. 3 కోట్లకు పైగా అయినందున ఆ మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆయన కొడుకు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నుంచి రకవరీ చేయాలని డిమాండ్​ చేశారు. ​