జనహిత పాదయాత్రను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

జనహిత పాదయాత్రను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించనున్న జనహిత పాదయాత్రను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ముకరంపురలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొనే జనహిత పాదయాత్ర గంగాధర మండలం ఉప్పరి మల్యాల నుంచి ప్రారంభమై మండలకేంద్రం వరకు కొనసాగుతుందన్నారు. సమావేశంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజ్, సీనియర్ నాయకులు సమద్ నవాబ్, చర్ల పద్మ, దన్న సింగ్, తదితరులుపాల్గొన్నారు.

 జనహిత పాదయాత్రకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు కోరారు. శుక్రవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులతో జనహిత పాదయాత్రపై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. సమావేశంలో లీడర్లు మల్లికార్జున రాజేందర్, అర్ష మల్లేశం, నరసన్న, అంజన్ కుమార్, ప్రసాద్, శ్రీనివాస్, తదితరులు
 పాల్గొన్నారు.