మాణిక్కం ఠాగూర్ రేవంత్కు ఏజెంట్గా పనిచేస్తుండు

మాణిక్కం ఠాగూర్ రేవంత్కు ఏజెంట్గా పనిచేస్తుండు

కాంగ్రెస్లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నవారే కారణమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉంటూ పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.. రేవంత్కు ఏజెంట్గా పని చేస్తున్నాడని అన్నారు. సీనియర్లను గోడకేసి కొడుతా..హోంగార్డులతో పోల్చినా అధిష్టానం నుంచి మందలింపులేకపోవడం విడ్డూరమన్నారు.

రాహుల్ గాంధీతో కూడా వాళ్లకు నచ్చినట్లు మాట్లాడించుకున్నారని శశిధర్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి బదర్స్ విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర కలత చెందానన్న ఆయన..40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు.