Karnataka Polls : దోసె వేయడం నేర్చుకున్న ప్రియాంక గాంధీ

Karnataka Polls : దోసె వేయడం నేర్చుకున్న ప్రియాంక గాంధీ

కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మైసూరులోని ప్రముఖ రెస్టారెంట్‌లో దోసెలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అంతకుముందు ఆమె కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ, కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా లాంటి కొంత మందితో కలిసి అల్పాహారం చేశారు.

కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. అందులో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మైసూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మైలారీ హోటల్‌ను సందర్శించారు. పార్టీ నేతలతో కలిసి ఆ హాటల్ లో అల్పాహారం చేసిన ప్రియాంక గాంధీ.. దోసె తయారీ నేర్చుకోవడంపై ఆసక్తిని కనబర్చారు. ఈ విషయాన్ని రెస్టారెంటు యజమానితో చెప్పగా.. వారు సంతోషంతో ఆమెను వంట గదిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె దోసెలు వేయడానికి ప్రయత్నిస్తూ.. పిండిని తావాపై పోసి, సరైన ఆకారంలో దోసెను చేశారు. కానీ దోసెను తిప్పి వేయడంలో మాత్రం ఆమె విఫలమయ్యారు. సమయానికి దోసెను పెనంపై నుంచి తీయకపోవడంతో అది మాడిపోయింది. దీంతో వంటగదిలో ఉన్నవారు నవ్వడం ప్రారంభించారు. 

దోసె తయారీ తర్వాత, వాద్రా రెస్టారెంట్ యజమాని, అతని కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతే కాకుండా వారితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

https://twitter.com/INCIndia/status/1651117087199207425