మోదీ ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ

మోదీ  ప్రభుత్వం కుట్రతోనే జనగణనను ఆపేసింది: రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణను చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జనగణనతోనే దేశం ఎక్స్ రే, స్కానింగ్ రిపోర్టు తెలుస్తుంది..సరైన డేటా ఉన్నప్పుడే ఎవరి ప్రాతినధ్యం ఎంతనేది తెలుస్తుందన్నారు.  దేశంలో కుల, మత రాజకీయాలు పెరిగాయ్.. మోదీ ప్రజల ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతోంది..కుట్ర పూరితంగానే మోదీ ప్రభుత్వం జనగణన ఆపేసిందని రాహుల్ విమర్శించారు. 

తెలంగాణలో కులగణన దేశానికే రోల్ మోడల్ అన్నారు రాహుల్. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించాం.. కులగణన డేటా దేశంలో కేవలం తెలంగాణ సర్కార్ దగ్గర మాత్రమే ఉంది.. తెలంగాణలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల డేటా ఉంది.. సరైన డేటా ఉన్నప్పుడే ఏదైనా చేయగలమన్నారు రాహుల్ గాంధీ. 

ALSO READ | ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోదీ

దళిత, గిరిజనులు అభివృద్ది చెందొద్దని కుట్ర జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ. దళిత, గిరిజనుల నిధులను కేంద్రం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. దళిత గిరిజనులను అంటరాని వారిగా చూస్తున్నారు..ఇంగ్లీషును దళిత, గిరిజన విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. దళిత గిరిజనుల సంపదను అదానీ , అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వా్న్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ. 

ఓబీసీ చరిత్రను RSS, BJP అణచివేస్తుందన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్ లోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు  అన్యాయమే జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ.  దళిత ఓబీసీలకు రిజర్వేషన్లలోనూ న్యాయం జరగడం లేదు..దేశంలో ఏ సంస్థలోనూ బడుగు బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు.