నాగర్​కర్నూల్​ స్థానంలో.. భారీ మెజార్టీపై కాంగ్రెస్​ నజర్

నాగర్​కర్నూల్​ స్థానంలో.. భారీ మెజార్టీపై కాంగ్రెస్​ నజర్
  • క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్న నేతలు
  • చేరికలపై స్పెషల్​ ఫోకస్

నాగర్​కర్నూల్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడంపై కాంగ్రెస్​ నాయకత్వం దృష్టి పెట్టింది. నాగర్​కర్నూల్  కాంగ్రెస్​  క్యాండిడేట్​గా మల్లు రవిని ప్రకటించిన అనంతరం నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు బూత్​ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, గద్వాల, అలంపూర్​ ఇన్​చార్జీలు సంపత్​కుమార్, సరిత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి ఈ ప్రోగ్రామ్​లో పాల్గొంటూ క్యాడర్​ను ఉత్సాహ పరుస్తున్నారు.

ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, స్పోర్ట్స్​​అథారిటీ చైర్మన్​ శివసేనారెడ్డి, పార్లమెంట్​ ఇన్​చార్జి మధుసూదన్​ రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఏఐసీసీ కో ఆర్డినేటర్​ కొప్పుల రాజు, ట్రైనింగ్​ ఇన్​చార్జి రోహిత్ చౌదరి, సభ్యుడు​జైన్, పీసీసీ వార్​రూమ్​ ఇన్​చార్జి పవన్​ మల్లాది తదితరులు బీఎల్ఏల ట్రైనింగ్​కు హాజరవుతున్నారు.

బూత్​ ఏజెంట్లపై ఫోకస్..

గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను గుర్తించడంతో పాటు బోగస్​ ఓటర్లను అడ్డుకోవాలనే లక్ష్యంతో ట్రైనింగ్​ ఇస్తున్నారు. గ్రామంలో ప్రతి 50 మంది ఓటర్లకు కో ఆర్డినేటర్​ను నియమించేలా ప్లాన్​ చేస్తున్నారు. ఓటర్​ను పోలింగ్​బూత్​ వరకు తీసుకువచ్చే బాధ్యతను వీరికి అప్పగిస్తున్నారు. వీరిని సమన్వయం చేసే బాధ్యతను మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్​ నాయకులు, అనుబంధ విభాగాల బాధ్యులకు అప్పగించారు. కాంగ్రెస్​కు అనుకూలంగా, తటస్తంగా ఉండే ఓటర్లను గుర్తించి ఎర్లీగా పోలింగ్​లో పాల్గొనేలా చూడాలని సూచిస్తున్నారు. ఇతర పార్టీలకు అనుకూలంగా ఉండే ఓటర్లను ప్రభావితం చేసేలా బీఎల్ఏలు, ఓటింగ్​ కో ఆర్డినేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. 

చేరికలపై నజర్..

నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్​ లీడర్లతో పాటు గ్రామాలు, పట్టణాల్లో ప్రభావం చూపించే నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఇటీవల మాజీ మంత్రి చిత్తరంజన్​ దాస్​ కాంగ్రెస్​లో చేరగా, మరికొంత మందిని చేర్చుకొనేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

ప‌‌‌‌‌‌‌‌దేండ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్  పార్టీనే : జూపల్లి కృష్ణారావు

అచ్చంపేట/కొల్లాపూర్ :  ప‌‌‌‌‌‌‌‌దేండ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్  పార్టీయేన‌‌‌‌‌‌‌‌ని, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  విజయం సాధిస్తుందని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు తెలిపారు. సోమ‌‌‌‌‌‌‌‌వారం అచ్చంపేట, కొల్లాపూర్​ పట్టణాల్లో అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్​ నియోజ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్గాల‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్  పార్టీ బూత్  లెవ‌‌‌‌‌‌‌‌ల్ ఏజెంట్లు, క‌‌‌‌‌‌‌‌మిటీ స‌‌‌‌‌‌‌‌భ్యుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల మాదిరిగానే పార్లమెంట్  ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల్లోనూ కాంగ్రెస్  పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి బ‌‌‌‌‌‌‌‌హుమతిగా ఇద్దామన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసిందని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని విమర్శించారు. మాజీ  సీఎం కేసీఆర్  తాను చేసిన త‌‌‌‌‌‌‌‌ప్పుల‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్  ప్రభుత్వాన్ని బ‌‌‌‌‌‌‌‌ద్నాం చేస్తున్నారన్నారు. కేసీఆర్​ అస‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్థత వ‌‌‌‌‌‌‌‌ల్లే  రాష్ట్రంలో ఈ ప‌‌‌‌‌‌‌‌రిస్థితి నెల‌‌‌‌‌‌‌‌కొందని తెలిపారు. రాజ‌‌‌‌‌‌‌‌కీయ ల‌‌‌‌‌‌‌‌బ్ధి కోసమే పంటలు ఎండిపోయాయని జిల్లా ప‌‌‌‌‌‌‌‌ర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. చేసేదంతా చేసి మొస‌‌‌‌‌‌‌‌లి క‌‌‌‌‌‌‌‌న్నీరు కారుస్తున్నార‌‌‌‌‌‌‌‌ని ధ్వజమెత్తారు. ద‌‌‌‌‌‌‌‌క్షిణ తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో ఒక్క ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌  ప్రాజెక్టును పూర్తి చేయకుండా, కనీసం నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయకుండా మోసం చేశారన్నారు.

యువ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగాలు ఇవ్వకుండా, ప‌‌‌‌‌‌‌‌ల్లెల‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్  నాయ‌‌‌‌‌‌‌‌కులు ఓట్లు ఎలా అడుగుతున్నార‌‌‌‌‌‌‌‌ని ప్రశ్నించారు. కాంగ్రెస్  పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమ‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. కేసీఆర్ ను దుర్మార్గుడు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఇప్పుడు ఆయ‌‌‌‌‌‌‌‌న పంచ‌‌‌‌‌‌‌‌నే చేరాడని, ఆయనకు ఓట్లు అడిగే హ‌‌‌‌‌‌‌‌క్కు లేదన్నారు. అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్, జగదీశ్వర్ రావు పాల్గొన్నారు.