సీఎం, తుమ్మల, సుదర్శన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం

సీఎం, తుమ్మల, సుదర్శన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం

బోధన్, వెలుగు :  సన్నవడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్​ అందజేస్తున్నందున బోధన్​ అంబేద్కర్​ చౌరస్తాలో సోమవారం  కాంగ్రెస్​ శ్రేణులు సీఎం రేవంత్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్​గంగాశంకర్​ మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

 తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషామొనొద్దీన్​, శివాలయం చైర్మన్​ హరికాంత్ చారి,  మున్సిపల్ మాజీ చైర్మన్​ఎల్లయ్య,  పట్టణ యుత్ అధ్యక్షుడు తలారి నవీన్​,  నాయకులు దామోదర్​ రెడ్డి, శరత్​ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.