
కరీంనగర్, వెలుగు: గంగాధర మండలంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు హాజరవుతున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు ఘన స్వాగతం పలికారు.
ఆదివారం సాయంత్రం కొత్తపల్లిలోని వెలిచాల కార్యాలయం వద్ద వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత 200 వాహనాలతో భారీ ర్యాలీగా వెలిచాల రాజేందర్ రావు ఉప్పర మల్యాలలో జరిగే కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కార్యక్రమానికి తరలివెళ్లారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వాగతం పలికారు.